Fri Dec 05 2025 19:40:13 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అంబర్పేట్లో ఉన్న ఆలీ కేఫ్ వద్ద ఉన్న పెయింట్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి.

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అంబర్పేట్లో ఉన్న ఆలీ కేఫ్ వద్ద ఉన్న పెయింట్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. అయితే ఈ మంటల్లో పలువురు మహిళలు చిక్కుకున్నారు. పెయింట్ డబ్బాలు తగలపడుతుండటంతో పెద్దయెత్తున మంటలతో పాటు పొగ కూడా అలుముకుంది. దీంతో అక్కడకు వెళ్లాలంటే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
మంటలలో చిక్కుకున్న మహిళను...
గాయపడిన ఒక మహిళను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఇంకా అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకోకపోవడంతో స్థానికులే మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల నివాసిత ప్రాంతాలు ఉండటంతో మంటలు వ్యాప్తిచెందుతాయేమోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
Next Story

